Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మత వివక్ష: ముస్లింకు ఉద్యోగం ఇవ్వని కార్పొరేట్ సంస్థ

మత వివక్ష: ముస్లింకు ఉద్యోగం ఇవ్వని కార్పొరేట్ సంస్థ
, గురువారం, 21 మే 2015 (12:09 IST)
మత వివక్ష కారణంగా ముస్లింకు ఉద్యోగం దొరకలేదు. ఓ వైపు మత వివక్షను చూపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ చెబుతున్నా, ఇండియాలో వివక్ష పూర్తిగా రూపుమాసిపోలేదనడానికి తాజాగా తేలింది. వజ్రాలను ఎగుమతి చేసే ఓ కార్పొరేట్ సంస్థ ముస్లిం మతస్తుడివంటూ, ఓ నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేమని స్పష్టం చేసింది. 
 
వివరాల్లోకి వెళితే, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న హరికృష్ణ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎంబీఏ విద్యను అభ్యశించిన జేషన్ అలీ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి కంపెనీ నుంచి ఓ మెయిల్ వచ్చింది. నీవు ముస్లిం అయినందువల్ల ఉద్యోగాన్నిఇవ్వలేకపోతున్నామన్నది దాని సారాంశం. దీంతో అవాక్కయిన అలీ, ఉద్యోగానికి సరిపడే విద్యార్హతలు లేకపోతే ఆ విషయం చెప్పాలిగానీ, ఇదేంటని ప్రశ్నిస్తూ, మెయిల్ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీంతో వివాదం చెలరేగింది.
 
అయితే, తాము ఎటువంటి వివక్షనూ చూపలేదని, అంతకుముందే శిక్షణలో వున్న అభ్యర్థిని ఎంపిక చేశామని చెబుతున్న సదరు సంస్థ టైపింగ్‌లో పొరపాటు కారణంగా అటువంటి మెయిల్ వెళ్లిందని చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu