Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ మహిళా నేతపై ఫైర్ అయిన గాయని చిన్మయి.. మహిళల దుస్తులే కారణమా?

Advertiesment
Chinmayi

సెల్వి

, శనివారం, 10 జనవరి 2026 (13:38 IST)
మహిళల హక్కులు, లైంగిక వేధింపులపై స్పందించే సింగర్ చిన్మయి తాజాగా కాంగ్రెస్‌కు చెందిన మహిళా నాయకురాలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దీనిపై తాజాగా చిన్మయి ఘాటు ట్వీట్ చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెలివిజన్ చర్చల్లో ఇలాంటి ప్రవర్తనను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? లేక ఈ తరహా ఆలోచనలకు పార్టీ ఉన్నత నాయకత్వం మద్దతు ఇస్తుందా.. అంటూ ఆమె ప్రశ్నించారు. 
 
మహిళల దుస్తులపై ఆంక్షలు విధిస్తే లైంగిక వేధింపులు ఆగిపోతాయన్న భావన పూర్తిగా తప్పని అనేక మంది మహిళలు చెబుతున్నా, వాటిని పట్టించుకోకపోవడం దారుణమని చిన్మయి పేర్కొన్నారు. డిబేట్‌లో పాల్గొన్న వ్యక్తి మహిళా కాంగ్రెస్ నాయకురాలేనన్న విషయం మరింత ఆందోళన కలిగిస్తోందని చిన్మయి తెలిపారు. 
 
పురుషులు తమను తాము నియంత్రించుకోలేరన్న భావనను బలపరుస్తూ, మహిళల దుస్తులే అత్యాచారాలకు కారణమన్న తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది మహిళలపై మాత్రమే కాదు, పిల్లలు, వృద్ధులు, మరణించినవారిపై జరిగిన లైంగిక హింసను కూడా పరోక్షంగా సమర్థించినట్లే అంటూ చిన్మయి తీవ్రంగా మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుతుస్రావం అవుతోందా? రుజువు చూపించమన్న టీచర్స్: మానసిక వేదనతో విద్యార్థిని మృతి