Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫడ్నవిస్ ప్రమాణం... మోడీ, అద్వానీ, పంకజ, ఉద్దవ్, బాబు హాజరు

ఫడ్నవిస్ ప్రమాణం... మోడీ, అద్వానీ, పంకజ, ఉద్దవ్, బాబు హాజరు
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (22:29 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ తోపాటు పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ పాల్గొన్నారు.
 
ఫడ్నవిస్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 44 యేళ్ల దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. 
 
కాగా, ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, కేంద్రమంత్రులు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, వసుందర రాజే, మనోహర్ పారికర్, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu