Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుప్రీం ఆదేశాలు తుంగలో తొక్కుదాం.. కర్నాటక అసెంబ్లీలో తీర్మానం.. రాష్ట్రపతి పాలన?

కావేరీ జలాల విడుదలపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించరాదని కర్నాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో ప్రజాస్వామ్యానికి కీలక మూలస్తంభాలైన శాసన, న్యాయ వ్యవస్థల మధ్య వివాదా

సుప్రీం ఆదేశాలు తుంగలో తొక్కుదాం.. కర్నాటక అసెంబ్లీలో తీర్మానం.. రాష్ట్రపతి పాలన?
, శనివారం, 24 సెప్టెంబరు 2016 (09:41 IST)
కావేరీ జలాల విడుదలపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించరాదని కర్నాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో ప్రజాస్వామ్యానికి కీలక మూలస్తంభాలైన శాసన, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీస్తోంది. ఫలితంగా కర్నాటక రాష్ట్రం రాష్ట్రపతి పాలన దిశగా పయనిస్తోంది. 
 
కావేరీ జలాలను తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయాల్సిందేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కర్నాటక రిజర్వాయర్లలో నీరు లేక పోయినా.. ఉన్న నీటినే విడుదల చేస్తారు. ఇది ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ వైఖరిని కూడా సుప్రీం తప్పుబట్టింది. 
 
ఈ నేపథ్యంలో కర్నాటక అసెంబ్లీ శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. కోర్టు ఉల్లంఘనకు తావులేకుండా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 'కావేరి బేసిన్‌లోని 4 జలాశయాలలో నీటిమట్టం అత్యంత దిగువస్థాయికి పడిపోయింది. మొత్తం నాలుగింటిలో కేవలం 27.6 టీఎంసీల నీరుంది. ఈ నీటిని తాగునీటికి తప్ప ఇతరత్రా వినియోగించడం సాధ్యంకాదం'టూ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. 
 
అంటే సుప్రీం ఆదేశాలను శిరసావహించలేమని అసెంబ్లీ తీర్మానం ద్వారా తేల్చింది. ఈ నిర్ణయం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేలా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా ఇది ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందని వారు అంటున్నారు. మరోవైపు.. కావేరి వివాదం సుప్రీంకోర్టులో ఉందన్న కారణంతో కేంద్రం ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌' హోదా రద్దు.. సింధు ఒప్పందంపైనా నీలినీడలు.. భారత్ ఆంక్షలు