Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవ్‌జోత్ సింగ్ కౌర్ దారెటు..? భార్యాభర్తలు చెరో దారిలో పోతారా? ఏం చేస్తారో?

రాజ్యసభ సభ్యత్వానికి, బీజేపీకి రాజీనామా చేయడంతో నవ్‌జోత్ సింగ్ సిద్ధూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సతీమణి నవ్జోత్ కౌర్ సిద్ధూ మాత్రం తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని చెప్ప

నవ్‌జోత్ సింగ్ కౌర్ దారెటు..? భార్యాభర్తలు చెరో దారిలో పోతారా? ఏం చేస్తారో?
, మంగళవారం, 19 జులై 2016 (13:38 IST)
రాజ్యసభ సభ్యత్వానికి, బీజేపీకి రాజీనామా చేయడంతో నవ్‌జోత్ సింగ్ సిద్ధూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సతీమణి నవ్జోత్ కౌర్ సిద్ధూ మాత్రం తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే ''కామెడీ నైట్స్ విత్ కపిల్'' షోలో తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. ఈ నేపథ్యంలో తన భర్త అటు రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి కూడా రాజీనామా చేసినా.. తాను మాత్రం బీజేపీ వీడనని.. తన భర్త పంజాబ్ అభివృద్ధి కోసం కష్టపడాలని అనుకుంటున్నారన్నారు. 
 
తన భర్త నిర్ణయాలు ఆయనవని.. కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధూ చేరతారా లేదా అనే విషయాన్ని మాత్రం నిర్ధారించలేదన్నారు. పంజాబ్కు సేవ చేయాలన్న స్పష్టత ఆయనకుందని, పంజాబ్ తప్ప మరో ఆప్షన్ ఆయనకు ఏమీ లేదని అన్నారు. అయితే... సిద్ధూతో పాటు ఆయన భార్య కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోకి వస్తే తాము సాదరంగా స్వాగతిస్తామని ఆప్ నేత భగవంత్ మాన్ చెప్పారు. ప్రస్తుతం నవ్జోత్ కౌర్ సిద్ధూ అమృతసర్ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెదేపాలో కొనసాగలేం... వైసిపికి పోదామా... : మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అంతర్మథనం!