Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్ ఎండలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 6 నిప్పు పొయ్యిలు వెలిగిస్తే ఫైన్!

బీహార్ ఎండలు : ఉదయం 9 నుంచి సాయంత్రం 6 నిప్పు పొయ్యిలు వెలిగిస్తే ఫైన్!
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:10 IST)
బీహార్‌లో మండుతున్న ఎండలకు చాలా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండవేడిమి ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. అగ్ని ప్రమాద ఘటనల్లో ఇప్పటివరకు 66 మంది ప్రజలు, 1200 జంతువులు చనిపోయాయని అంచనా వేయబడుతుంది. దీంతో బీహార్ సర్కార్ ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు ఓ పరిష్కారాన్ని ఆలోచించింది. 
 
పగటిపూట ఉదయం 9 గంటంల నుంచి సాయిత్రం 6 గంటల వరకు ఎటువంటి వంట కార్యక్రమాలు చేయకూడదని రాష్ట్ర ప్రజలను ఆదేశించింది. వంట చేసుకోడానికి ఇంట్లో పొయ్యి వెలిగించారో జైలు శిక్ష తప్పుకుండా పడనుందట. వంట పనులతో పాటు హారతి, హోమాలు, దీపారాధన వంటి నిప్పుతో కూడుకున్న పూజా కార్యక్రమాలను కూడా చేయవద్దని బీహార్ ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. 
 
బీహార్ ప్రజలంతా ఉదయం 9 గంటలలోపే ధూప, దీప కార్యక్రమాలు ముగించాలన్నారు. అంతేకాక ఎలాంటి ఫంక్షన్లలోనైనా పొయ్యిల్లాంటివి ఉపయోగించరాదని పేర్కొంది. నిప్పుపొయ్యిలో వంట చేస్తున్నప్పుడు నిప్పురవ్వలు ఎగిరి పూరిగుడిసెలు అంటుకుంటున్న దృష్టాంతాలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో మద్యం విక్రయాలకు బ్రేక్ పడుతుందా? 20 శాతం పెరిగిన అమ్మకాలు