Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐఐటి కోచింగ్ కోసం అమ్మాయి... రేప్ చేసి నగ్నంగా వీడియోలు తీసిన కామాంధుడు...

ఐఐటి కోచింగ్ కోసం అమ్మాయి... రేప్ చేసి నగ్నంగా వీడియోలు తీసిన కామాంధుడు...
, సోమవారం, 30 మార్చి 2015 (18:11 IST)
పెద్ద చదువులు చదువుకుని తన కుటుంబానికి సహాయంగా ఉండాలని తలిచిన 17 ఏళ్ల బాలిక కలను కాలరాచాడో కామాంధుడు. ఐఐటి లో ర్యాంక్ సాధించాలని కలలు కన్న ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగాట్టాడు ఆ దుర్మార్గుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆమె ఉంటున్న హాస్టల్ యజమాని ఆ అమ్మాయిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను నగ్నంగా వీడియో తీశాడు. ఆ తర్వాత వాటిని చూపించి నెలల తరబడిగా బ్లాక్‌మెయిల్ పాల్పడుతూ ఆమెను లొంగదీసుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... బాధితురాలు రాజ్‌ఘడ్‌కు చెందిన బాలిక. ఐఐటి కోచింగ్ కోసం 2014 మేలో భోపాల్‌కు వచ్చిన ఆమె గౌతంనగర్లోని హాస్టల్లో ఉంటోంది. ఆమెపై కన్నేసిన ఆ హాస్టల్ యజమాని, ఒక రోజు తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి కేక్ కొనాలని మాయ మాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ఆమె అపస్మారక స్థతిలోకి వెళ్లిపోయాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆమెను నగ్నంగా వీడియో, ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంకా 50 వేలు డబ్బు కావాలంటూ ఒత్తిడి చేయడంతో విషయాన్ని తన పేరెంట్స్ కి చేరవేసిందా అమ్మాయి. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu