Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగళూరులో ఫ్లాటుకో కుక్క... హమ్మయ్య హాయిగా నిద్రపోవచ్చు...

బెంగళూరులో ఫ్లాటుకో కుక్క... హమ్మయ్య హాయిగా నిద్రపోవచ్చు...
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (16:17 IST)
ఈమధ్య కుక్కలను ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం, అంటే అవసరం లేకపోయినా అదో ఫ్యాషన్‌గా కుక్కను పెంచుకోవడం మామూలైంది. ముఖ్యంగా బెంగళూరు నగరంలో ఏ వీధిలోకి వెళ్లినా ఫ్లాట్ల పైనుంచి కుక్కలు భౌ.. భౌలతో బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో ఫ్లాట్ల సంస్కృతి ఎక్కువ. ఒక ఫ్లాటులో సుమారు 100 నుంచి 150 వరకు గృహ సముదాయాలుంటాయి. ఈ గృహాలన్నిటిలోనూ కుక్కలను పెంచుకునేవారు ఎక్కువగానే ఉంటున్నారు. 
 
ఐతే ఫ్లాటుకో కుక్క అయితే ఫర్లేదు. ఒకే ఫ్లాటులో మూడునాలుగు కుక్కలు ఉంటే పరిస్థితి ఇక వేరే చెప్పక్కర్లేదు. పక్క ఇంట్లో వారికి కుక్కల అరుపులతో పిచ్చెక్కిపోతుంది. అలాంటి పరిస్థితిని అడ్డుకోక తప్పదు. అందుకనే... కుక్కల సంతతిని తగ్గించుకోవడంతోపాటు వాటివల్ల అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు బెంగళూరు మున్సిపాలిటీకి ఓ ప్రతిపాదన వచ్చింది. అదేమిటంటే... ఫ్లాటుకు ఒకే ఒక్క కుక్క.
 
అంతేకాదు... కుక్కల సంతతిని అదుపులో పెట్టేందుకు చర్యలు కూడా తీసుకోవాలి. ఫ్లాటుకో కుక్క నిబంధనను అమలుచేసేందుకుగాను బీబీఎంపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అర్బన్ డెవలప్మెంట్‌కు దీనిపై ఓ ప్రతిపాదనను కూడా పంపింది. దీని ప్రకారం ఇకపై ఫ్లాటులో కుక్కలను పెంచుకునేందుకు లైసెన్సులే కాదు... ఒకే కుక్కకు అనుమతి అనే విషయాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. 
 
ఇది ఆమోదం పొందితే బెంగళూరు ఫ్లాట్స్‌లో దద్దరిల్లిపోయే కుక్కల అరుపులు తగ్గుతాయి. ప్రజలు ఆరోగ్యవంతమైన నిద్ర పోవచ్చు. మరి మిగిలిన నగరాలు కూడా ఈ కుక్కల సంగతి ఏమిటో కాస్త చూస్తే బావుంటుంది. అదేనండీ మన తెలుగురాష్ట్రాల్లోని నగరాలు.

Share this Story:

Follow Webdunia telugu