Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక : బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే

పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక : బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
, సోమవారం, 29 జూన్ 2015 (08:21 IST)
రాజకీయ నాయకులు హద్దులుదాటుతున్నారు. మాటలతూటాలు పేల్చుతున్నారు. మొన్నటికిమొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ విపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోశారు. టీఎంసీ కార్యకర్తల వైపు ఎవరైనా కొన్నెత్తి చూస్తే కనిగుడ్లు పీకేస్తానని, చేయ్యెత్తితో ఎత్తిన చేయిని తెగనరుకుతానంటూ హెచ్చరికలు చేసి సంచలనం సృష్టించారు. 
 
తాజాగా ఇదే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అశిష్ మర్జిత్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించారు. 'ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలోని పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పెంపుడు జంతువులుగా మారారని... తక్షణమే తీరు మార్చుకోవాలని సూచించారు. 
 
'మీ మద్దతుతో వాళ్లు... వాళ్ల ఆధారంతో మీరు చేస్తున్న దారుణాలకు తెర దించండి' అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం కోల్‌కతాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేయగా, ఆ సమయంలో బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధిర్ చౌదరీ కూడా వేదికపైనే ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu