Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14 ఏళ్ల విద్యార్థి... 22 యేళ్ల టీచర్‌తో లేచిపోయాడు.. మావాడు చాలా మంచోడు.. తప్పంతా టీచర్‌దే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తనకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయురాలితో 14 యేళ్ల విద్యార్థి ఒకడు లేచిపోయాడు. ఇంట్లో నుంచి పారిపోతూ ఇంట్లోని బంగారు ఆభరణాలతో పాటు.. రూ.8 వేల నగ

14 ఏళ్ల విద్యార్థి... 22 యేళ్ల టీచర్‌తో లేచిపోయాడు.. మావాడు చాలా మంచోడు.. తప్పంతా టీచర్‌దే...
, సోమవారం, 5 డిశెంబరు 2016 (16:34 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తనకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయురాలితో 14 యేళ్ల విద్యార్థి ఒకడు లేచిపోయాడు. ఇంట్లో నుంచి పారిపోతూ ఇంట్లోని బంగారు ఆభరణాలతో పాటు.. రూ.8 వేల నగదును చోరీ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బరేలీలోని ఓ పాఠశాలలో 14 యేళ్ళ బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో 22 యేళ్ళ టీచర్ పాఠాలు బోధిస్తోంది. ఈ టీచర్.. ఆ బాలుడు చదివే పాఠశాల యజమాని కుమార్తె కావడం గమనార్హం. 
 
ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంద. 'మా కుమారుడు ఇంట్లో దొంగతనం చేసి రూ.8000, ఆభరణాలు దొంగిలించి అతడు చదివే పాఠశాల టీచర్‌‌తో కలిసి వెళ్లిపోయాడు. వాస్తవానికి వాడికి ఇలాంటివి తెలియదు. ఆమె చెప్పడం వల్లే అలా చేశాడు. ఆ టీచర్‌ ది మంచి వ్యక్తిత్వం, ప్రవర్తన కాదు. అందుకే మా కుమారుడితో ఇలాంటి తప్పు చేయించింది' అంటూ ఆ బాలుడి తండ్రి రామ్‌ వీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాను కుమారుడి కోసం తిరిగి తిరిగి అలిసిపోయానని, ఎక్కడా కనిపించలేదని, ఇంతపెద్ద ఆలోచన చేసే తెలివితేటలు, మానసిక పరిపక్వత తమ వాడికి లేదని వాపోయాడు. సోమవారం నాటికి తన కుమారుడిని గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపాడు. కాగా, తమపై పాత కక్షను తీర్చుకునేందుకు ఆ కుటుంబం నాటకాలు ఆడుతుందని, ఒకసారి వారికి తమకు ఆ కుటుంబానికి గొడవ అయిందని టీచర్‌ తరుపు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
కాగా, ఈ కేసుపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఇది కాస్తంత ఏవగింపు కలిగించే కేసు. అబ్బాయే టీచర్‌‌ను తీసుకెళ్లాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి బాలుడిపైనే కేసు నమోదు చేశాం. బహుశా వారిద్దరికి ఏదో సంబంధం ఉండి ఉండొచ్చు. కుటుంబాలకు భయపడి వెళ్లిపోయి ఉండొచ్చు' కేసు దర్యాప్తు చేస్తున్నాం' అని పోలీసు ఉన్నతాధికారి తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. వీడియో స్ట్రీమింగ్ అండ్.. జిప్ ఫార్మాట్