Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్ బాలిక బట్టలిప్పి వివస్త్రను చేసి ఫోటోలు తీశారు :: అవమానంతో ఆత్మహత్య!

మైనర్ బాలిక బట్టలిప్పి వివస్త్రను చేసి ఫోటోలు తీశారు :: అవమానంతో ఆత్మహత్య!
, శనివారం, 10 అక్టోబరు 2015 (08:56 IST)
దేశ ఐటీ నగరంగా భాసిల్లుతున్న బెంగుళూరులో కూడా మహిళలపై జరుగుతున్న నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇటీవల నిర్భయ తరహా గ్యాంగ్ రేప్ జరిగింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈనేపథ్యంలో మరో దారుణం వెలుగు చూసింది. 15 యేళ్ల మైనర్ బాలికను వివస్త్రను చేసి ఫోటోలు తీసి వాటిని నెట్‌లో పెడతామంటూ బెదిరించారు. దీంతో అవమానం భరించలేక ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బెంగుళూరు నగరానికి చెందిన సంగీత అనే 15 యేళ్ల బాలికను కొన్ని రోజులుగా ఐదుగురు పోకిరీలు వేధిస్తూ వచ్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల మూడో తేదీన ఆ బాలికను దౌర్జన్య చేసి, చెరబట్టి వివస్త్రను చేసి ఫోటోలు తీశారు. దీనిపై కూడా సంగీత తన కుటుంబ సభ్యులతో కలసి పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయిన ఫలితం లేకపోయింది. 
 
ఆ తర్వాత కూడా ఆ యువకులు మళ్లీ వచ్చి సంగీతను వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంగీత ఓ సూసైడ్ నోట్ కూడా రాసి తన పట్ల ఆ దుర్మార్గులు ప్రవర్తించిన తీరు, స్టేషన్‌కు వెళితే పోలీసుల నిర్లక్ష్యాన్ని వివరించినట్టు సమాచారం. ఈ ఘోరానికి ఐదుగురు యువకులు పాల్పడ్డారు. వీరిలో ఒకరు బంధువు కూడా ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu