Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడితో కలిసి మద్యం సేవించింది.. పోలీస్ స్టేషన్‌లోనే ముద్దులాడింది!

ప్రియుడితో కలిసి పీకల వరకు మద్యం సేవించిన ఓ యువతి పోలీసు స్టేషన్‌లో ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టింది. పోలీసులు వారిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా తనపనిని పూర్తి చేసింది.

ప్రియుడితో కలిసి మద్యం సేవించింది.. పోలీస్ స్టేషన్‌లోనే ముద్దులాడింది!
, బుధవారం, 24 ఆగస్టు 2016 (11:29 IST)
ప్రియుడితో కలిసి పీకల వరకు మద్యం సేవించిన ఓ యువతి పోలీసు స్టేషన్‌లో ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టింది. పోలీసులు వారిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా తనపనిని పూర్తి చేసింది. ఇకలాభం లేదని భావించిన పోలీసులు.. ఆ యువతిపై కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు పంపించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగళూరుకు చెందిన అర్చన అనే యువతి తమిళనాడులోని తుత్తిపట్టులోని కామరాజనగర్‌కు చెందిన వివేకానంద్ అనే యువకుడిని ప్రేమించింది. ఇటివల వేలూరుకు వచ్చిన ఈ ప్రేమ జంట పీకల వరకు మద్యం సేవించింది. ఆతర్వాత బైక్‌ రైడింగ్‌కు బయలుదేరింది. వివేకానంద్ బైక్‌ను అడ్డదిడ్డంగా నడుపుతుంటే వెనుకే కూర్చున్న అర్చన ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో వారి బైకు ఓ కారును రాసుకుపోయింది. 
 
ర్యాష్ డ్రైవింగ్ ఏంటంటూ ఆ కారు యజమాని ప్రశ్నించగా ఒక్క ఉదుటన బైక్ దిగిన అర్చన ఆయనపై చేయి చేసుకుంది. పరుగు పరుగున అక్కడకు వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైనా ఆమె దాడి చేసింది. దీంతో సమాచారం అందుకున్న మహిళా ఎస్సై తన సిబ్బందితో కలిసి అక్కడకు వచ్చి అర్చనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ యువతి వీరంగమాడింది. అక్కడికక్కడే వివేకానంద్‌ను కౌగించుకుని ముద్దులాట మొదలెట్టింది. ఇలాగైతే కుదరదని భావించిన పోలీసులు వివేకానంద్‌పై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టి అతడిని పంపించివేసి అర్చనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఆమెను సెంట్రల్ జైలుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాల పర్వం : 5 నెలల్లో 1012 రేప్ కేసులు నమోదు