Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్యాన్స్ నేర్చుకోవాలని వస్తే.. బాలికలపై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు.. ఎక్కడ?

డ్యాన్స్ నేర్పుకునేందుకు వచ్చే బాలికలపై డాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్నాటకలోని కొప్పాల జిల్లాలో చోటుచేసుకుంది. గత కొంత కాలంగా హనుమేష్ అనే వ్యక్తి ''డ్రీమ్స్ డ్యాన్స్ అకాడమీని నడుపుత

డ్యాన్స్ నేర్చుకోవాలని వస్తే.. బాలికలపై డ్యాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు.. ఎక్కడ?
, శనివారం, 13 ఆగస్టు 2016 (18:07 IST)
డ్యాన్స్ నేర్పుకునేందుకు వచ్చే బాలికలపై డాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్నాటకలోని కొప్పాల జిల్లాలో చోటుచేసుకుంది. గత కొంత కాలంగా హనుమేష్ అనే వ్యక్తి ''డ్రీమ్స్ డ్యాన్స్ అకాడమీని నడుపుతున్నాడు. దానిలో భాగంగా డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులపై అసహజ లైంగిక చర్యలకు పాల్పడుతుండటంతో అతనిపై కేసు నమోదైంది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే...కర్నాటకలోని కొప్పాల జిల్లాకు చెందిన హనుమేష్  షికారిపురా, హోస్పేట్, బళ్లారి, మునీరాబాద్‌లో డ్యాన్స్ క్లాసులు నిర్వహిస్తుంటాడు. టీవీ రియాల్టి షోలలో పాల్గొనాలని వచ్చిన కొందరు బాలికలు ఇతని వద్ద డ్యాన్స్‌లో శిక్షణ పొందేందుకు వస్తుంటారు. డాన్స్ నేర్పిస్తానని వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుడంతో పాటు వారికే తెలీకుండా ఫొటోలు తీసి... డబ్బులివ్వమంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
విషయం తెలుసుకున్న హనుమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు రంగప్రవేశం చేసి బళ్లారికి సమీపంలోని ఒక మారుమూల గ్రామంలో తిరుగుతున్న హనుమేష్‌ను అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికలను సున్నిత అవయవాలపై కొడుతూ నయీమ్‌ హింసించేవాడట.. ఆ రెండు కోరికలు మాత్రం..?