Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీగారూ.. మద్యంపై నిషేధం విధించండి.. యోగా తర్వాతే: నితీష్ కుమార్

యోగాపై ధ్యాస పెట్టేందుకు ముందుకు మద్యం గురించి ఆలోచించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. మద్యపాన నిషేధం చేయకుండా యోగా నిష్ఫ్రయోజనమని తెలిపారు. పనిలో పనిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నితీష్

మోడీగారూ.. మద్యంపై నిషేధం విధించండి.. యోగా తర్వాతే: నితీష్ కుమార్
, సోమవారం, 20 జూన్ 2016 (10:18 IST)
యోగాపై ధ్యాస పెట్టేందుకు ముందుకు మద్యం గురించి ఆలోచించాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. మద్యపాన నిషేధం చేయకుండా యోగా నిష్ఫ్రయోజనమని తెలిపారు. పనిలో పనిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు. యోగాలో మొదటి నిబంధన ప్రకారం మద్యపానానికి దూరంగా ఉండాలనే విషయంపై మోడీ దృష్టి పెట్టాలన్నారు. 
 
యోగా మొదటి నిబంధన మద్యపానానికి దూరంగా ఉండటం. యోగా డే సందర్భంగా ఆ నిర్ణయం తీసుకోలేకుంటే ఆ యోగా విఫలమేనని తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు సంచలనంగా మరాయి. 
 
నిజంగా మీకు (మోడీ) యోగాపై అంత తీవ్రమైన ఆలోచన ఉన్నట్లయితే ముందు మద్యంపై నిషేధాన్ని విధించండని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. యోగా అనేది ఏ ఒక్కరోజో గుర్తు చేసుకునే విషయం కాదని, అది జీవితంలో భాగం కావాలని, నిత్యం జరగాల్సిన ప్రక్రియ అంటూ నితీష్ కుమార్ తెలిపారు. 
 
"ప్రధాని మోడీ ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎన్నో ఏళ్లుగా చేస్తున్నా.. ఆసనా, ప్రాణయామ, యోగా నిద్రాణ్'' చేస్తుంటానని నితీష్ కుమార్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతివేళ్లు తెగిన బిడ్డ కోమాలోకి ఎలా వెళ్లాడు... వైద్యుల నిర్లక్ష్యమే కారణమా?