Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు.. ఆర్బీఐ చర్యలు నామమాత్రమే... పట్టించుకోని పాలకులు

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఉత్పన్నమైన కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కష్టాలు... ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.

కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు.. ఆర్బీఐ చర్యలు నామమాత్రమే... పట్టించుకోని పాలకులు
, సోమవారం, 28 నవంబరు 2016 (08:46 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఉత్పన్నమైన కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కష్టాలు... ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అదేసమయంలో భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించే చర్యలను కేంద్ర రాష్ట్ర పాలకులు తీసుకోక పోవడం గమనార్హం. 
 
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత కారణంగా ఏటీఎం తెరిచిన గంటకే మూతపడుతున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఖాతాదారులు ఆందోళనలకు దిగుతున్నారు. ఇటు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు స్థంభించాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి సిటీలో పగలు, అర్థరాత్రి వేళల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ఏటీఎం వద్ద పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
 
ఎటుచూసినా నో క్యాష్‌, ఔటాఫ్ సర్వీస్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్లయితే ఏటీఎం షెట్టర్ కూడా తీయడం లేదు. హైదరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయాల వద్ద ఇదే దుస్థితి. ఈ పరిస్థితి నెల నుంచి రెండు నెలల వరకు పట్టే అవకాశముందని అంటున్నారు అధికారులు. ప్రధాన నగరాల్లోనే ఇలావుంటే.. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల గురించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అక్కడి ప్రజలు బ్యాంకులపై ఆధారపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దుతో రూ.500లకే పెళ్ళి: అతిథులకు టీ మాత్రమే ఇచ్చారు.. మోడీ ప్రశంస