Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజలు బీఫ్ తింటే ప్రభుత్వానికి ఎందుకు..? హలాల్ బీఫ్‌ను తినేందుకు నేను ఇష్టపడతా: ఓవైసీ

ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో చాలామంది సెలెబ్రిటీలు అత్యున్నత న్యాయస్థానాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. జల్లికట్టును బ్యాన్ చేయడంపై దక్షిణాది టాప్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ, జల్లిక

ప్రజలు బీఫ్ తింటే ప్రభుత్వానికి ఎందుకు..? హలాల్ బీఫ్‌ను తినేందుకు నేను ఇష్టపడతా: ఓవైసీ
, సోమవారం, 9 జనవరి 2017 (17:04 IST)
ఇండియా టుడే దక్షిణాది సదస్సు-2017లో చాలామంది సెలెబ్రిటీలు అత్యున్నత న్యాయస్థానాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. జల్లికట్టును బ్యాన్ చేయడంపై దక్షిణాది టాప్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ, జల్లికట్టు ఇష్టం లేకపోతే బిర్యానీపై కూడా నిషేధం విధించాలని వ్యాఖ్యానించాడు. ఇదే వేదికపై వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా బీఫ్‌పై స్పందించారు.  
 
ప్రజలు బీఫ్ తినే విషయంపై జరుగుతున్న రద్దాంతంపై ఓవైసీ స్పందించారు. ప్రజలు బీఫ్ తినే విషయంపై ప్రభుత్వాలకు ఏం పని అంటూ ప్రశ్నించారు. తమ అభిరుచి మేరకు ఆహారం తీసుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు. హలాల్ చేసిన బీఫ్‌ను తినేందుకు తాను ఇష్టపడతానని ఓవైసీ చెప్పారు. 
 
సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని ఆలపించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. హిందుత్వను ఓ జీవన విధానంగా సుప్రీంకోర్టు గుర్తించిన నేపథ్యంలో.. ఇస్లాం, క్రైస్తవం కూడా చాలామందికి జీవన విధానంగా మారిపోయిందనే విషయాన్ని కూడా సుప్రీం గుర్తించాలని ఓవైసీ పేర్కొన్నారు.
 
హిందువులు చాలావరకు సెక్యులర్‌గా ఉన్నారని, కానీ ముస్లిం యువతలో అతివాద భావజాలం పెరిగిపోతుండటంపై ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. బాగా మాట్లాడే ఓ వ్యక్తి హిందువులను తనవైపు తిప్పుకున్నారని.. ఇందుకు కారణం బీజేపీని అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్సేనని ప్రధాని మోడీని ఉద్దేశించి ఓవైసీ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ యాక్టింగ్ చూసి నా గుండెల్లో కత్తి దించినట్లు ఫీలయ్యా: 'ఆస్కార్' నటి మెరిల్ స్ట్రీప్