Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటి సరఫరాలో రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు ఎవరైనా ఒక్కటే : కేజ్రీవాల్

నీటి సరఫరాలో రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు ఎవరైనా ఒక్కటే : కేజ్రీవాల్
, గురువారం, 26 మార్చి 2015 (14:51 IST)
నీటి సరఫరా విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నీటి సరఫరాలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, వీఐపీలు, సామాన్య ప్రజలు అనే అంటూ తేడా చూపించవద్దని కోరారు. వేసవిలో నీటి ఎద్దడి నెలకొన్నట్టయితే, నీటి సరఫరా ఎవరికైనా నిలిపివేయాలంటూ కోరారు. 
 
ఆయన ఢిల్లీ జల్ మండల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా మాట్లాడారు. అవసరం కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్న వారిపై ఓ కన్నేయాలని సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, సామన్యులు అంటూ తేడా చూపించవద్దని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే వీఐపీలకు కూడా నీటి సరఫరా నిలిపేసేందుకు వెనుకాడవద్దని అన్నారు. 
 
అంతేకాకుండా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహణ చేయడం చేతకాకపోతే అధికారాన్ని ఆమ్ ఆద్మీకి అప్పగించి తప్పుకోవాలని ఆయన బీజేపీకి సవాలు విసిరారు. అవినీతి విచ్చలవిడిగా జరగడం వల్లే కార్పొరేషన్ నిర్వహణ కష్టంగా మారిందని కేజ్రీవాల్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu