Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నీ భర్తకు పదోన్నతి వచ్చేలా చేసుకో'... మేజర్ భార్యకు కల్నల్ వేధింపులు!

భారత సైన్యంలో పని చేసే కింది స్థాయి సిబ్బందికితో పాటు.. వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి వేధింపులు ఉంటాయో మరోమారు తేటతెల్లమైంది. తన కింద పని చేసే ఓ మేజర్ భార్యకు కమాండింగ్ ఆఫీసర్, కల్నల్‌గా పని చేసే లెఫ్టి

'నీ భర్తకు పదోన్నతి వచ్చేలా చేసుకో'... మేజర్ భార్యకు కల్నల్ వేధింపులు!
, శుక్రవారం, 5 ఆగస్టు 2016 (14:22 IST)
భారత సైన్యంలో పని చేసే కింది స్థాయి సిబ్బందికితో పాటు.. వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి వేధింపులు ఉంటాయో మరోమారు తేటతెల్లమైంది. తన కింద పని చేసే ఓ మేజర్ భార్యకు కమాండింగ్ ఆఫీసర్, కల్నల్‌గా పని చేసే లెఫ్టినెట్ జనరల్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ‘నీ భర్తకు పదోన్నతి వచ్చేలా చేసుకో’... ఇది నీ చేతుల్లోనే ఉందంటూ తన మనసులోని కోర్కెను వెల్లడించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
కమాండింగ్ ఆఫీసర్, కల్నల్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ అరవింద్ సింగ్ రావత్ ఏడాది క్రితం పదవీ విరమణ చేశారు. ఆయన పదవీకాలంలో తన క్రింది స్థాయి మేజర్‌ భార్యను తన కార్యాలయానికి రప్పించి, ‘నీ భర్తకు పదోన్నతి వచ్చేలా చేసుకో’ అన్నట్టు ఆరోపణలు నమోదయ్యాయి. ఆయనపై ఆరు నెలల్లోగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆర్మీకి ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ లక్నో ధర్మాసనం ఆదేశించింది. 
 
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్‌‌లో లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్థన్ సింగ్ ఈ కేసు దాఖలు చేశారు. తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్‌ రావత్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తనకు వ్యతిరేకంగా యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రావత్ ఇచ్చారని హర్షవర్థన్ పేర్కొన్నారు. 
 
ఆరోపణలపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ తీర్పు చెబుతూ లెఫ్టినెంట్ జనరల్ అరవింద్ రావత్ దురుద్దేశం రుజువైందని పేర్కొంది. ఆయన జబల్‌పూర్‌లో మెటీరియల్ మేనేజ్‌మెంట్ కాలేజీ కమాండెంట్‌గా పనిచేసేటపుడు పిటిషనర్‌ను అణచివేసేందుకు, వేధించేందుకు రావత్ ప్రయత్నించారని తెలిపింది. కార్యాలయం పని వేళల్లో క్రింది స్థాయి అధికారిని పిలిచే అధికారం రావత్‌కు ఉందని, అయితే క్రిందిస్థాయి సిబ్బంది భార్యను కార్యాలయానికి రప్పించే అధికారం రావత్‌కు లేదని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలుడిని బ్లాంకెట్‌లో చుట్టి.. సూట్‌కేసులో పెట్టి.. రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లింది.. ఆపై..?!