Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమితాబ్ అదుర్స్.. ట్విట్టర్లోనూ సూపర్ స్టారే..! ప్రియాంక చోప్రా నెక్ట్స్!

అమితాబ్ అదుర్స్.. ట్విట్టర్లోనూ సూపర్ స్టారే..! ప్రియాంక చోప్రా నెక్ట్స్!
, గురువారం, 18 డిశెంబరు 2014 (19:07 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ ట్విట్టర్లోనూ తన పవరేంటో చూపించారు. వెండితెరతో పాటు బుల్లి తెరపైనా సూపర్ స్టార్‌గా నిరూపించుకున్నారు. తాజాగా ఆయన సోషల్ నెట్ వర్క్ ఫాలోయింగ్‌లోనూ తిరుగులేని నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ అకౌంట్‌కు 1.2 కోట్ల మంది ఫాలోయర్లున్నారు. తద్వారా ట్విట్టర్‌లో అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లున్న నటుడిగా ఆయన ఖ్యాతిగాంచారు. 
 
‘టు ద న్యూ’ అనే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ ఈ మేరకు బిగ్ బీకి వెల్లువెత్తిన నెటిజన్ల అభిమానాన్ని వెల్లడి చేసింది. ఇక ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షాగా పేరుగాంచిన షారుఖ్ ఖాన్ (1.04 కోట్లు) రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ (54 లక్షలు) కొనసాగుతున్నాడు. ఇక నటీమణుల విషయానికొస్తే ప్రియాంకా చోప్రా 80 లక్షల మంది ఫాలోయర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దీపికా పదుకొనే ఆమె తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu