Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పన్నీరు'కు ఇక కన్నీరే... శశికళ అత్యవసర సమావేశం... ఆమెకు సీఎం సీటు కావాలట...?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఇక కన్నీరే అనే సెటైర్లు తమిళనాడులో వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళ చేతుల్లోకి వెళ్లిపోయాయో ఇక అప్పట్నుంచి పన్నీర్ సెల్వం సీఎం సీటుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అంటున్నారు. విశ్వసనీయ

'పన్నీరు'కు ఇక కన్నీరే... శశికళ అత్యవసర సమావేశం... ఆమెకు సీఎం సీటు కావాలట...?
, శుక్రవారం, 30 డిశెంబరు 2016 (15:50 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఇక కన్నీరే అనే సెటైర్లు తమిళనాడులో వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళ చేతుల్లోకి వెళ్లిపోయాయో ఇక అప్పట్నుంచి పన్నీర్ సెల్వం సీఎం సీటుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం నాడు పార్టీ సీనియర్, ముఖ్య నేతలతో శశికళ సమావేశం కాబోతున్నారట. తను సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే మార్గంపై వారితో చర్చించనున్నట్లు సమాచారం.
 
ఇప్పటికే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించిన దగ్గర్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా శశి భజన చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. మొత్తమ్మీద శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే రోజు ఎంతో దూరంలో లేదని ఆమె మద్దతుదారులు చెపుతున్నారు. 
 
ఇంకోవైపు అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను డీఎంకే జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఎందుకంటే, వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు మరి. శశికళకు వ్యతిరేక వర్గం ఎవరయినా 20 మంది ఇటువైపు వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి ఇక స్టాలినే. మరి ఆ ఛాన్స్ శశికళ ఇస్తుందా... వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళకు జయలలిత ఎలా పరిచయం అయ్యారు.. వీడియో రెంటింగ్ బిజినెస్ టు అన్నాడీఎంకే చీఫ్?