Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్కే.నగర్ ఉప ఎన్నికలు : అన్నాడీఎంకే టీటీవీ దినకరన్ పోటీ

చెన్నై, ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆర్కే.నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక

ఆర్కే.నగర్ ఉప ఎన్నికలు : అన్నాడీఎంకే టీటీవీ దినకరన్ పోటీ
, బుధవారం, 15 మార్చి 2017 (11:19 IST)
చెన్నై, ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆర్కే.నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చే నెల 12వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడులోని ముఖ్య పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే జయ మేనకోడలు దీప పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే, అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ టీవీ జయా టీవీలో అధికారికంగా ప్రటించారు. 
 
అంతకుముందు.. టీటీవీ దినకరన్ అభ్యర్థిత్వాన్ని అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ కేఏ. సెంగోట్టయ్యన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీలో ఖరారు చేసి ప్రకటించారు. ఏప్రిల్ 12న ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 15న ఫలితాలు వెలువడనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకు సంతానం లేరు.. అందుకే మృతి.. కరుణ ఆరోగ్యం కుదుటపడింది.. కారణం?