Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా ఎల్కే. అద్వానీ!

లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఛైర్మన్‌గా ఎల్కే. అద్వానీ!
, గురువారం, 18 సెప్టెంబరు 2014 (09:45 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రజుడు ఎల్కే. అద్వానీకి ఆ పార్టీ నాయకత్వం ఓ పదవిని కట్టబెట్టింది. నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఈ కురువృద్ధుడిని పక్కనబెట్టిన కమలనాథులు.. ఎట్టకేలకు ఓ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత లోక్‌సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. అద్వానీ అధ్యక్షతన ఈ కమిటీ లోక్‌సభ సభ్యులకు సభలో పాటించాల్సిన నైతిక విలువలను సూచించడంతో పాటు వారి ప్రవర్తనను పర్యవేక్షించనుంది.
 
ఈ కమిటీలో టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి సభ్యుడు కాగా, అరుమోజితెవాన్, నినాంగ్ రింగ్, షేర్ సింగ్ గుబే, హేమంత్ తుకారం, ప్రహ్లాద్ జోషి, భగవత్ సింగ్ కోష్యారి, అర్జున్ రామ్ మెగ్వాల్, భత్రుహరి, కరియా ముండే, జయశ్రీబెన్ పటేల్, సుమేథనాధ్ సరస్వతి, భోల్ సింగ్‌లను సభ్యులుగా కొనసాగుతారు. కాగా, వయోభారం కారణంగా నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో అద్వానీకి మొండిచేయి చూపిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu