Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖుష్బూ... పెళ్లికి ముందే సెక్స్, సోనియా... స్వలింగ సంపర్కం

ఖుష్బూ... పెళ్లికి ముందే సెక్స్, సోనియా... స్వలింగ సంపర్కం
, శనివారం, 29 నవంబరు 2014 (12:56 IST)
ఇటీవల చెన్నై నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన ఖుష్బూ, ఆమెను పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై భాజపా జాతీయ కార్యదర్శి హెచ్.రాజా విమర్శల వర్షం కురిపించారు. పెళ్లికి ముందే సెక్స్ తప్పేమీ కాదంటూ దానిని సమర్థించిన నటి ఖుష్బూ, స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా చట్టంలో సవరణలు తీసుకురావాలంటూ పేర్కొన్న సోనియా గాంధీలు ఇద్దరూ కలిసినా తమిళనాడులో తమ భాజపా పార్టీని ఎదుర్కొనలేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ద్రవిడ పార్టీలకు సరైన పోటీ, ప్రత్యామ్నాయం తమ పార్టీయేనంటూ ప్రకటించారు. ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమిళనాడులో సమీకరణాలు ఏమీ మారబోవని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu