Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబై హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించిన తృప్తి దేశాయ్

ముంబై హాజీ అలీ దర్గాలోకి ప్రవేశించిన తృప్తి దేశాయ్
, గురువారం, 12 మే 2016 (11:00 IST)
భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు, మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ దేశంలోని ముస్లీంల పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన ముంబైలోని హాజీ అలీ దర్గాలో ప్రవేశం చేసి సంచలనం సృష్టించింది. దేశంలోని ప‌లు ప్ర‌సిద్ధ ఆల‌యాల్లో మ‌హిళ‌ల ప్ర‌వేశం కోసం ఈవిడ పోరాడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళ హక్కుల ఉద్యమ కార్యకర్తలతో కలిసి భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆమె గురువారం ఉదయం హ‌జీ అలీ ద‌ర్గాలో ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. అయితే దర్గా గర్భాలయంలోకి తృప్తి దేశాయ్‌ ప్రవేశించలేదు. 
 
ఇదిలావుంటే ప్రార్థనల అనంతరం ఆమె వెలుపలికి వచ్చి సంచలన వాఖ్యలు చేశారు. దర్గాలో మహిళలను అనుమతించే చోటు వరకు వెళ్లి ప్రార్థనలు చేశాం. దర్గాలోని ముఖ్యప్రాంతంలోకి (గర్భగుడి) వెళ్లి ప్రార్థనలు చేసేవిధంగా జరగాలని వేడుకున్నా. ఈసారి పోలీసులు సహకరించారు. ఏప్రిల్ 28న తృప్తి దేశాయ్‌తో పాటు మరికొంతమంది మహిళా కార్యకర్తలు దర్గా ప్రవేశం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు, స్థానిక ముస్లీంలు అడ్డుకున్నారు. 
 
ఏఐఎంఐఎం హెచ్చరికలను జారీచేసింది. ప్రార్థనాలయాల్లో మహిళలకు అనుమతి నిరాకరణపై పోరాటం చేస్తున్న తృప్తి దేశాయ్ శనిసింగనాపూర్, త్రయంబకేశ్వర్ ఆలయాల ప్రవేశం అనంతరం ముంబైలోని ప్రముఖ దర్గా ప్రవేశాన్ని ఆమె ఎంచుకున్నారు. అయితే త్వ‌ర‌లోనే మ‌హిళ‌లు ద‌ర్గా గ‌ర్భాల‌యంలోకి ప్ర‌వేశిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తృప్తి దేశాయ్ ద‌ర్గాలోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో ఛాంద‌స వాదుల‌నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో అక్క‌డ ఘర్ష‌ణ వాతావరణం నెలకొంది.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎండిపోతున్న రిజర్వాయర్లు... 10 రాష్ట్రాల్లో తీవ్ర దుర్భిక్షం.. దేశ ఆర్థికవ్యవస్థపై పెనుభారం