Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆన్‌లైన్‌లో అబార్షన్లు : క్యాష్ చేసుకుంటున్న నాగ్‌పూర్ వాసి!

ఆన్‌లైన్‌లో అబార్షన్లు : క్యాష్ చేసుకుంటున్న నాగ్‌పూర్ వాసి!
, మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (13:07 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా ఆన్‌లైన్ అబార్షన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ తరహా అబార్షన్లు దేశ సరిహద్దులు కూడా దాటి సాగుతుండటం గమనార్హం. సాధారణంగా అనేక దేశాల్లో అబార్షన్లు చేయడం చట్ట వ్యతిరేకం. అలాగే, యుక్త వయస్సులో ఉండే యువతుల్లో అనేక మంది తమ బాయ్ ఫ్రెండ్స్‌తో డేటింగ్‌లో పాల్గొనడం వల్ల అవాంఛిత గర్భం ధరిస్తుంటారు. వీటిని తొలగించుకోవడం అంత సులభమైన పనికాదు. 
 
కొన్ని దేశాల్లో దీనికి సంబంధించి అత్యంత కఠినమైన చట్టాలు కూడా అమలులో ఉన్నాయి. అలాంటి చోట్ల అసలు అబార్షన్ చట్టవిరుద్ధం అవుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల్ని కనాల్సిందే. వైద్యులు కూడా ఈ చట్టాన్ని చూసి భయపడి అబార్షన్లు చేయరు. సరిగ్గా ఇదే అంశాన్ని నాగ్పూర్కు చెందిన మోహన్ కాలే అనే వ్యాపారవేత్త అందిపుచ్చుకున్నారు. 
 
అబార్షన్ అవ్వడానికి ఉపయోగపడే పిల్స్ (టాబ్లెట్ల)ను నేరుగా బాధితులకు కొరియర్ చేస్తున్నారు. ఇలాపంపినందుకు ఆయనకు ఆయా మహిళలు కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు. ''మా దేశంలో మహిళలకు ప్రాథమిక హక్కులు కూడా లేవు. నేను గర్భవతినని తెలియగానే చాలా భయపడ్డాను. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి'' అని పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ ఈమెయిల్ చేశారు. ''ఇక ఇప్పుడు నేను గర్భవతిని కాను.. చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ.. ఐ లవ్యూ'' అని థాయ్లాండ్కు చెందిన మరో మహిళ రాసింది.
 
కాగా, మోహన్ కాలే ప్రతి నెల సుమారుగా 2 వేల కిట్లను వివిధ ప్రాంతాలకు, దేశాలకు కొరియర్ చేస్తున్నట్టు తెలిసింది. అబార్షన్లు చట్టవిరుద్ధం అయిన దేశాల్లో మాత్రమే ఈయన వ్యాపారం జరుగుతుంది. ఆన్లైన్లో ఆర్డర్లు వస్తాయి. అలా వచ్చిన చోట్లకు ఆయన ఈ టాబ్లెట్లు పంపుతారు. గర్భం దాల్చిన తర్వాత తొలి తొమ్మిది వారాల్లో ఈ మందులు తీసుకుంటే గర్భస్రావం అయిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu