Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లాష్ ఫ్లాష్ అమీర్ ఖాన్.. దేశం వదిలి వెళ్లిపోయారు.. ఎక్కడికెళ్లారో..?!

ఫ్లాష్ ఫ్లాష్ అమీర్ ఖాన్.. దేశం వదిలి వెళ్లిపోయారు.. ఎక్కడికెళ్లారో..?!
, శనివారం, 28 నవంబరు 2015 (11:31 IST)
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అభిమానులకు ఓ చేదువార్త. అమీర్ ఖాన్ దేశం వదిలి వెళ్లిపోయారు. అసహనం వ్యాఖ్యలపై రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఇతర ప్రముఖలందరూ ఆడిపోసుకోవడంతో అమీర్ ఖాన్ దేశం వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అమీర్ ఖాన్ శాశ్వతంగా దేశం వీడలేదు. సినిమా షూటింగ్‌కు వెళ్తూ వెళ్తూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాకు చిక్కాడు. 
 
ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న ‘డంగల్’ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించి లూధియానాలో షూటింగ్ పూర్తి చేసుకున్న అమీర్ ఖాన్ తన సినిమా తదుపరి షూటింగ్ కోసం ఇలా అమెరికా బాట పట్టాడని సన్నిహితులు అంటున్నారు. 
 
అయితే ఇంత హడావిడిగా టైట్ సెక్యూరిటీ మధ్య అమెరికా వెళ్ళడం నిజంగానే షూటింగ్ కోసమా ..? లేదంటే కొంత కాలం తనను టార్గెట్ చేస్తున్న విమర్శకుల దాడి నుండి తప్పించుకోవడానికా..? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu