Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసిస్ భయం... 800 మంది విదేశీయుల గడువు తీరినా బెంగళూరులో తిష్ట... ఏంటి సంగతి?

హైదరాబాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదుల వేళ్లు మెల్లగా విస్తరించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలియడంతో ఇపుడు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలపైన పోలీసులు దృష్టి సారించారు. ప్రతి ఒక్క నగరంలో పరిస్థితులను సమీక్షించుకుంటున్నారు. కాగా కర్నాటకలోని బెంగళూరు నగరంలో

ఐసిస్ భయం... 800 మంది విదేశీయుల గడువు తీరినా బెంగళూరులో తిష్ట... ఏంటి సంగతి?
, శుక్రవారం, 1 జులై 2016 (17:54 IST)
హైదరాబాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదుల వేళ్లు మెల్లగా విస్తరించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలియడంతో ఇపుడు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలపైన పోలీసులు దృష్టి సారించారు. ప్రతి ఒక్క నగరంలో పరిస్థితులను సమీక్షించుకుంటున్నారు. కాగా కర్నాటకలోని బెంగళూరు నగరంలో వీసా గడువు తీరినా 800 మంది విదేశీయులు తిష్ట వేసినట్లు కనుగొన్నారు. వీరంతా తలొక కారణం చెపుతూ ఇక్కడే కాలం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఐతే వీరిలో కొంతమంది వల్ల సమస్య వచ్చిపడుతోంది. జూన్ 27న బెంగళూరు నేషనల్ పార్క్ వద్ద ఉగండాకు చెందిన మహిళ నానా హంగామా చేసింది. దీనితో ఆఫ్రికా దేశం నుంచి వచ్చి ఇక్కడే తిష్ట వేసిన మొత్తం 600 మందిని వెనక్కి పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సోమవారం నాడు నప్లిమా మరియన్ అనే మహిళ కొందరితో గొడవపడి వారిపై దాడి చేసింది. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేయగా ఆమె ఉగాండాకు చెందినదని కనుగొన్నారు. పాస్ పోర్టు గురించి విచారిస్తే మిస్ అయినట్లు ఆమె సమాధానం చెప్పారు. 
 
కాగా రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇలా విదేశీయులు వీసా గడువు తీరినా ఎంతమంది ఉన్నారని వాకబు చేస్తే సుమారు 800 మందికి పైగా ఉన్నట్లు తేలింది. వీరి సంగతి ఇలా ఉంటే జనవరి 31న టాంజానియన్ మహిళపై దాడి జరిగింది. దానితో విదేశీయులపై దాడి అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇలా విదేశాల నుంచి ఇక్కడి వచ్చినవారితో కొత్త తలనొప్పులు వస్తున్నాయి. కాగా హైదరాబాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదుల వ్యవహారం బయటపడిన దగ్గర్నుంచి అన్ని నగరాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మరోవైపు బెంగళూరులో ఇలా తిష్ట వేసి కూర్చున్న వారిని పంపేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. కిమ్ జోంగ్ 130 కిలోలు పెరిగారట.. మనోవ్యాధే కారణమా..? భద్రతపై బెంగతో..?