Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి తర్వాత.. ఇంటి పేరు మార్చుకోవడం వారికి నచ్చలేదట!

పెళ్లికి తర్వాత.. ఇంటి పేరు మార్చుకోవడం వారికి నచ్చలేదట!
, గురువారం, 5 మార్చి 2015 (19:57 IST)
పెళ్లి తర్వాత.. ఇంటి పేరు మార్చుకోవడం వారికి నచ్చలేదట! ఎవరికి అనుకుంటున్నారా? అదేనండి మహిళలకే. ఈ వివాహ సంస్థ చేసిన తాజా సర్వేలో వివాహ సంబంధంపై ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

దాదాపు 40 శాతం మంది మహిళలు పెళ్లైన తర్వాత తమ ఇంటి పేరు మార్చుకోవడాన్ని వ్యతిరేకించినట్లు సర్వే తేల్చింది. దేశ వ్యాప్తంగా 24 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 11,200 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించగా, 40.4 శాతం మంది ఇంటి పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారని సర్వే వెల్లడించింది. 
 
ఇంకా ఈ సర్వేలో తేలిన విషయాలేంటంటే.. వివాహం తర్వాత 27 శాతం మంది తమకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటుండగా, 18 శాతం మంది భర్తలతో పాటు అన్ని బాధ్యతలు పంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇక 14 శాతం మంది మాత్రం తల్లిదండ్రుల్లానే భర్తను కూడా భావిస్తున్నట్టు సర్వే తేల్చింది. 

Share this Story:

Follow Webdunia telugu