Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబా రాంపాల్ సత్‌లోక్ : ఆశ్రమం కాదు.. ఆయుధ గిడ్డంగి... నక్షత్ర హోటల్..

బాబా రాంపాల్ సత్‌లోక్ : ఆశ్రమం కాదు.. ఆయుధ గిడ్డంగి... నక్షత్ర హోటల్..
, శుక్రవారం, 21 నవంబరు 2014 (15:39 IST)
బాబా రాంపాల్ ఆశ్రమం ఓ ఆయుధ గిడ్డంగిగా ఉంది. పైగా.. ఈ ఆశ్రమంలోని సౌకర్యాలు నక్షత్ర హోటల్‌ను తలపిస్తున్నట్టు పోలీసులు జరిపిన తాజా తనిఖీల్లో బయపడింది. ముఖ్యంగా ఆశ్రమం పేరుతో రాంపాల్ అనుచరులు భారీ ఎత్తునే ఆయుధాలను సమకూర్చుకున్నారు. మారణాయుధాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 12 బోర్ రైఫిల్స్-23... 315 బోర్ రైఫిల్స్-10, ఒక పిస్టల్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. 
 
వీటితో పాటు వందల సంఖ్యలో బాటిల్ బాంబులు, యాసిడ్ డబ్బాలు దొరికాయి. అంతే కాదు అత్యంత విలాసవంతమైన భవనాలు, స్విమ్మింగ్ పూల్, మూవీ థియేటర్లు ఆశ్రమంలో ఉన్నాయి. ఆశ్రమం మొత్తాన్ని ఖాళీ చేయించామని, ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఆశ్రమం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బాబా రాంపాల్‌ను హిస్సార్ సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిసింది.
 
మరోవైపు.. నెలల తరబడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బాబా రాంపాల్ గురువారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ వింత వాదనను వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను పోలీసులకు సహకరించాలనే అనుకున్నా, తన సొంత కమెండోలు అందుకు అంగీకరించలేదని, తనను బయటకు రాకుండా బంధించారని ఆయన చెప్పారు.దీంతో న్యాయమూర్తి రాంపాల్ కొత్త వాదనపై విస్మయం వ్యక్తం చేశారు. 'మీ వాదన నమ్మశక్యంగా లేదే!' అంటూ రాంపాల్‌ను న్యాయమూర్తి నిలదీశారు. అంతేకాక సదరు వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కేసులో తదుపరి విచారణను కొనసాగించారు. 

Share this Story:

Follow Webdunia telugu