Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుపై ఏఐఏడీఎంకే గర్జన

2జి స్పెక్ట్రమ్ కేటాయింపుపై ఏఐఏడీఎంకే గర్జన
2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల విషయంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి ఎ.రాజా భారీ కుంభకోణానికి పాల్పడ్డారనీ, తక్షణమే ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నాడీఎంకె సభ్యులు లోక్‌సభలో గర్జించారు. కుంభకోణం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నా యూపీఎ ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విరుచక పడ్డారు.

కుంభకోణానికి సంబంధించి ఆయా పత్రికల్లో వచ్చిన వార్తలను సభలో ప్రదర్శించారు. స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మాట్లాడాలని సభ్యులకు సూచించారు. ఒకవైపు ఏఐడీఎంకె సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుక వెళ్లగా మరోవైపు వామపక్ష సభ్యులు కూడా వారికి తోడయ్యారు. బసుదేవ్ ఆచార్యపై తృణమూల్ కాంగ్రెస్ చేసిన విమర్శలను ఉపసంహరించుకుని భేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే ప్రశ్నోత్తరాల సమయంలోనే చర్చకు అవకాశమిస్తానని స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. అయినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం వరకూ వాయిదా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu