Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హర్యానా హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం!: 12 మంది మృతి

హర్యానా హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం!: 12 మంది మృతి
, సోమవారం, 26 జనవరి 2015 (16:48 IST)
హర్యానాలోని హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం హిస్సార్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో కాపలా లేని లెవల్‌ క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతున్న ట్రక్కును రైలు ఢీ కొట్టింది.
 
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందగా మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే ట్రైన్‌ వస్తున్న విషయం గమనించకుండా డ్రైవర్‌ ట్రక్కును ముందుకు పోనివ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu