Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో ఇంటర్ చివరి పరీక్ష.... 100 మంది గర్ల్స్ 'లేచిపోయారు'... ఎక్కడికీ..?

లేచిపోదామా... అనే మాటలను మనం సినిమాల్లో చూస్తుంటాం. ఐతే నిజ జీవితంలో ఇది జరిగితే తల్లిదండ్రుల గుండెకోత ఏ రీతిలో ఉంటుందో చెప్పనలవి కాని పరిస్థితి. నిజంగా కని పెంచి పెద్దవారిని చేసిన తమ పిల్లలు చెప్పా పెట్టకుండా వేరొకరితో ప్రేమ పేరుతో లేచిపోయి పెళ్లి చ

తమిళనాడులో ఇంటర్ చివరి పరీక్ష.... 100 మంది గర్ల్స్ 'లేచిపోయారు'... ఎక్కడికీ..?
, మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (14:15 IST)
లేచిపోదామా... అనే మాటలను మనం సినిమాల్లో చూస్తుంటాం. ఐతే నిజ జీవితంలో ఇది జరిగితే తల్లిదండ్రుల గుండెకోత ఏ రీతిలో ఉంటుందో చెప్పనలవి కాని పరిస్థితి. నిజంగా కని పెంచి పెద్దవారిని చేసిన తమ పిల్లలు చెప్పా పెట్టకుండా వేరొకరితో ప్రేమ పేరుతో లేచిపోయి పెళ్లి చేసేసుకుంటే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనానాతీతం. ఇంతకీ ఈ లేచిపోయే మాట ఇప్పుడు ఎందుకు అని అంటారా...? మరేం లేదు. 
 
తమిళనాడులో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో చివరి పరీక్ష వస్తుందంటే చాలు అక్కడి తల్లిదండ్రుల గుండెలు దడదడ కొట్టుకుంటాయి. దీనికి కారణం, ద్వితీయ సంవత్సరం చదివే అమ్మాయిల్లో కొందరు ప్రేమ పేరుతో అబ్బాయిలతో లేచిపోవడమే. గత ఏడాది ఇలా 125 మంది అమ్మాయిలు ద్వితీయ ఇంటర్ చివరి పరీక్ష పూర్తి కాగానే కనబడకుండా పోయారు. దీంతో వారివారి తల్లిదండ్రులు తమ కుమార్తె కనబడటం లేదని కేసులు పెట్టారు. ఐతే చివరికి తేలిందేమిటంటే... వారంతా తమతమ ప్రేమికులతో లేచిపోయి పెళ్లి చేసేసుకున్నారన్న సంగతి. 
 
ఈ ఏడాది కూడా సేమ్ టు సేమ్ సీన్ రిపీట్. 100 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. అమ్మాయిల తల్లిదండ్రులు యధావిధిగా తమ కుమార్తెలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే దర్యాప్తు చేసి అమ్మాయిల ఆచూకి కనుగొన్న పోలీసులు షాక్ అవుతున్నారట. వారంతా ప్రేమించివాడితో పెళ్లి చేసేసుకుని కనబడుతున్నారట. కనుక మిగిలినవారు కూడా ఇలాగే సెటిల్ అయి ఉంటారన్న వాదన వినబడుతోంది. ఐతే అందరూ ఇలాంటి దారిలో వెళ్లారా.. లేదంటే కొందరిని దుండగులు ఎవరైనా అపహరించుకుని పోయారా అనేది సస్పెన్సుగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu