Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనియా త్వరితగతిన కోలుకుంటున్నారు: చిదంబరం

సోనియా త్వరితగతిన కోలుకుంటున్నారు: చిదంబరం
, శనివారం, 13 ఆగస్టు 2011 (10:08 IST)
అమెరికాలో చిన్నపాటి సర్జరీ చేయించుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ త్వరితగతిన కోలుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలపారు. ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందన్నారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిపై తాజా వైద్య నివేదిక వివరాలను విలేకరులు అడిగినపుడు, మరింత లోతుగా సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఆమె వ్యక్తిగత ఆరోగ్య వివరాలు వెల్లడించే అధికారం తనకు లేదన్నారు.

పార్టీ ప్రతినిధి మాత్రమే వాటిని వెల్లడిస్తారని చెప్పారు. సోనియా ఆరోగ్యం వివరాలను ప్రతినిధే చూస్తున్నారని చెప్పారు. విలేకరులు మరీ గుచ్చిగుచ్చి ప్రశ్నించగా.. తనకు అందిన తాజా సమాచారం ప్రకారం ఆమె బాగా కోలుకుంటున్నారని చెప్పారు.

సోనియాకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగినట్టు ఇటీవల పలు కథనాలు వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె అమెరికాలోని ప్రఖ్యాత క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu