Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సబ్సిడీ భారత్‌ది...లాభం పాక్‌ది

ఉత్పత్తులు పొరుగు దేశానికి

సబ్సిడీ భారత్‌ది...లాభం పాక్‌ది
భారతదేశ ప్రభుత్వం రైతులకు అతి చవకగా అందిస్తున్న ఎరువులు, రసాయనాల ఉత్పత్తులు పాకిస్థాన్, బంగ్లాదేశ్, మరియు నేపాల్ దేశాలలోని రైతులకు అందుతున్నాయి.

వివరాలలోకి వెళితే... దేశంలోని రైతులకు సబ్సిడీ ధరలతో అందజేస్తున్న ఎరువులు, రసాయనాలను ఓ ముఠా దొంగతనంగా ఇక్కడినుంచి విదేశాలకు తరలించి అక్కడ లాభాలను ఆర్జించుకుంటున్నారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఇలాంటి స్మగ్లర్లను అరికట్టాలని పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోమ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో ఆదేశాలు జారీ చేసింది. కాని ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వంకూడా స్పందించలేదనేది స్పష్టమౌతోంది

నిరుడు ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై 1 లక్ష 17 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసింది. ఇది భారతదేశపు రక్షణశాఖ బడ్జెట్‌కన్నా 30వేల కోట్ల రూపాయలు అధికం.

ఇదిలావుండగా భారతదేశంలో సబ్సిడీ ధరలతో రైతులకు అందిస్తున్న ఎరువులు, రసాయనాలను రైతులకు అందనివ్వకుండా దొంగతనంగా విదేశాలకు తరలిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇక్కడినుంచి యూరియా, డీఏపీలను అధిక సంఖ్యలో ఆ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయని, ఇందులో ఎమ్ఓపీని దాదాపు నూరు శాతం దిగుమతి చేసుకుంటోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ ఖర్చు 60-70 కోట్ల రూపాయలుగా ఉంటుందనేది అంచనాగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అందుకు సహకరించడంలేదు. దీంతో దేశీయ రైతులకు అందాల్సిన సబ్సిడీ ఫలాలు విదేశాలుకు తరలిపోతుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu