Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.300 కోట్లు వసూలు చేస్తున్న మావోలు: రమణ్

రూ.300 కోట్లు వసూలు చేస్తున్న మావోలు: రమణ్
, శనివారం, 4 జులై 2009 (15:38 IST)
అటవీ ఉత్పత్తుల వ్యాపారులు, రవాణా ఆపరేటర్లు, ఖనిజ గనుల యజమానుల నుంచి యేడాదికి 300 కోట్ల రూపాయల మేరకు మావోయిస్టులు వసూలు చేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తెలిపారు.

మావోయిస్టుల నిధుల సేకరింపుపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మావోయిస్టులు తమకు అవసరమైన నిధులను తమ రాష్ట్రం నుంచే సమకూర్చుకుంటున్నారన్నారు. ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను సరఫరా వ్యాపారం చేస్తున్న వ్యాపారులు, ఇనుప గనులు కాంట్రాక్టర్లు, ట్రాన్స్‌పోర్టర్ల నుంచి యేడాదికి కనీసం 250 నుంచి 300 కోట్ల రూపాయల మేరకు నిధులను మావోలు వసూలు చేస్తున్నారని చెప్పారు.

ముఖ్యంగా, తెండు ఆకులను సిగరెట్లు, బీడీ తయారీకి ఉపయోగిస్తారని చెప్పారు. బస్తర్ రీజియన్‌లో లభించే అటవీ సంపదలో ఈ ఆకులు అత్యంత ముఖ్యమైనవిగా 57 సంవత్సరాల ముఖ్యమంత్రి తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న నక్సలైట్ల కార్యకలాపాలకు ఇది కేంద్ర బిందువుగా మారిన విషయం తెల్సిందే.

అంతేకాకుండా, ఈ రీజియన్‌లో దాదాపు 40 వేల చదరపుటడుగుల విస్తీర్ణం మేర గనులు వ్యాపించి ఉన్నట్టు తెలిపారు. దేశంలోని మొత్తం గనుల్లో ఇక్కడ 20 శాతం మేరకు ఈ రీజియన్‌లోనే ఉన్నాయి. తమ సొంత వ్యాపార కార్యకలాపాలను సజావుగా నిర్వహించుకునేందుకు వ్యాపారులు మావోయిస్టులకు భారీగా ముడుపులు చెల్లించుకుంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu