Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు : యూ టర్న్ తీసుకున్న వాల్మీకి

రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు : యూ టర్న్ తీసుకున్న వాల్మీకి
FILE
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఏఐసీసీ సెక్రటరీ షైరాజ్ జీవన్ వాల్మికి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వారసత్వ పాలన నిరోధించేందుకే రాహుల్ వివాహం చేసుకోనని శపథం చేశారని వాల్మీకి ముంబయిలో మీడియాతో అన్నారు.

ఈ మాటలు కలకలం రేపడంతో వెంటనే స్పందించిన ఆయన.. ఒకవేళ తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ముంబయి మీడియా సమావేశంలో తెలిపారు. ఆ విధంగా రాహుల్ అన్నట్టు తానూ ఎక్కడో విన్నానని వాల్మీకి వివరణ ఇచ్చారు.

ఇక వెంటనే ప్లేటు మార్చి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై విమర్శలకు తెరదీశాడు. ఆ గడ్డం మనిషి (మోడీ) ఆధ్వర్యంలో గుజరాత్ ముందుకుపోదని మీడియా దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu