Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాంత్రిక్-దేవాస్ ఒప్పందంపై విచారణకు కమిటీ: కేంద్రం

యాంత్రిక్-దేవాస్ ఒప్పందంపై విచారణకు కమిటీ: కేంద్రం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్-దేవాస్ మల్టీమీడియా మధ్య కుదిరిన ఒప్పందంపై విచారణ జరిపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఇద్దరు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేబినెట్ మాజీ కార్యదర్శి చతుర్వేది, ప్రణాళికా సంఘం సభ్యుడు రొడ్డం నరసింహంలకు స్థానం కల్పించారు. ఈ ఒప్పందంపై ఇద్దరు సభ్యుల కమిటీ విచారణ జరిపి నెలరోజుల్లో ప్రధానమంత్రికి నివేదిక సమర్పించనుంది.

గత 2005 సంవత్సరంలో ఈ యాంత్రింక్స్-దేవాస్ మల్టీమీడియా సంస్థల మధ్య ఎస్ బాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపుల ఒప్పందం కుదిరింది. ఇందులో రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ దేవాస్ సంస్థ ఇస్రోకు చెందిన మాజీ ఉన్నతాధిరి చంద్రశేఖర్‌ది. ఈ నేపథ్యంలో.. ఆరోపణలపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu