Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీకే నా ఓటు, ప్రధానిగా చూడాలి!: కిరణ్ బేడీ ప్రకటన

మోడీకే నా ఓటు, ప్రధానిగా చూడాలి!: కిరణ్ బేడీ ప్రకటన
, శుక్రవారం, 10 జనవరి 2014 (16:53 IST)
FILE
భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీకి మరో గట్టి మద్దతుదారు లభించారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బృందంలోని కీలక సభ్యురాలు, భారతదేశ తొలి ఐపీఎస్ అధికారణి కిరణ్ బేడీ తాను మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు.

స్థిర భారత్‌ కోసం, దేశంలో మెరుగైన పాలన కోసం, పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధి కోసం తన ఓటు బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకేనని మాజీ కిరణ్‌బేడీ బహిరంగ మద్దతు ప్రకటించారు.

దేశం సుస్థిరంగా ఉండాలంటే అనుభవజ్ఞుడితోనే సాధ్యమంటూ కిరణ్ బేడి వ్యాఖ్యానించారు. అవినీతి రహిత భారత్‌ కావాలంటే మోడీకే పట్టం కట్టాలని కిరణ్‌ బేడీ పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu