Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా
ఢిల్లీ , సోమవారం, 8 డిశెంబరు 2008 (20:04 IST)
మినీ సార్వత్రిక ఎన్నికలుగా పేర్కొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు చోట్ల అధికారాన్ని కైవసం చేసుకుంది. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాంలలో కాంగ్రెస్ గెలుపు సాధించింది. మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భాజపాలోని లోటుపాట్లు కాంగ్రెస్‌కు కలిసివచ్చి అక్కడ అధికారం మరోసారి వారి వశం అయింది. బరిలోకి యూపీ సీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ రంగంలోకి దిగివనప్పటికీ అక్కడ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఢిల్లీలో ఎన్నికలు జరిగిన మొత్తం 69 స్థానాల్లో కాంగ్రెస్ 42, భాజపా 23 స్థానాల్లో గెలుపు సాధించింది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి వసుంధరా రాజె నేతృత్వంలోని భాజపా చేపట్టిన అభివృద్ధి పనులు ఆమెను గట్టెక్కించలేకపోయాయి. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా కాంగ్రెస్ 96, భాజపా 79, ఇతరులు 25 సీట్లు గెలుచుకున్నారు. సీఎం రాజెపై భారతీయ జనతా పార్టీ అతివిశ్వాసంతో ఉండటంవల్ల తాము ఓడిపోయాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

రాజస్థాన్ ఎన్నికల రణరంగంలోకి బీఎస్పీ దిగినప్పటికీ అది కాంగ్రెస్‌ను ప్రభావితం చేయకపోగా అధికార భాజపాను దెబ్బతీసింది. వసుంధరా రాజె తిరిగి అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అంచనాలు పెట్టుకుంది. అయితే అది కాస్తా ఈ ఎన్నికల్లో తిరగబడింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ 32 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. మిజోరాం నేషనల్ ఫ్రంట్ నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది.

Share this Story:

Follow Webdunia telugu