Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణశిక్ష

ముంబై జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణశిక్ష
, గురువారం, 6 ఆగస్టు 2009 (13:06 IST)
గత 2003 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన జంట వరుస పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ముగ్గురికి మరణ శిక్ష విధిస్తూ పోటా కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అష్రాత్ షఫీక్ అన్సారీ (32), మహ్మద్ హనీఫ్ సయీద్ (46), ఈయన భార్య ఫెమీదా సయీద్ (43)లు దోషులుగా ఉన్న విషయం తెల్సిందే.

ఈ కేసు విచారణకు దాదాపు ఆరు సంవత్సరాల కాలం పట్టింది. 2003లో జరిగిన ఈ పేలుళ్లలో 52 మంది మృతి చెందగా, 226 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నిఖమ్ వాదిస్తూ.. దోషులుగా తేలిన ముగ్గురికి కఠిన శిక్ష విధించాలని గట్టిగా వాదించిన విషయం తెల్సిందే.

ఆయన ఊహించినట్టుగానే దోషులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా, ఈ పేలుళ్లు 2003 సంవత్సరం ఆగస్టు 25వ తేదీన ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, అత్యంత రద్దీగా ఉండే దక్షిణ ముంబైలోని జావేరి బజార్‌లలో బాంబు పేలుళ్లు సంభవించాయి.

Share this Story:

Follow Webdunia telugu