Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ మంత్రి హలప్ప అరెస్టు: ఆస్పత్రిలో చేరిక

మాజీ మంత్రి హలప్ప అరెస్టు: ఆస్పత్రిలో చేరిక
, సోమవారం, 10 మే 2010 (15:24 IST)
స్నేహితుని భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హాలప్పను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అంతలోనే ఆయనకు గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు.

కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న హాలప్పను ఆయన స్నేహితుడు ఓ రాత్రి విందు భోజనానికి ఆహ్వానించారు. ఆ సమయంలో గుండెనొప్పి వచ్చినట్టుగా నాటకమాడి మందుల కోసం స్నేహితుడిని బయటకు పంపారు. తర్వాత అతని భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు వీడియో క్లిప్పింగులు బయటపడ్డాయి.

ఈ కేసు ప్రస్తుతం సీఐడీ విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో గత వార రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హాలప్ప ఆదివారం మధ్యాహ్నం షిమోగా పోలీసుల ఎదు లొంగిపాయారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇంతలో ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారు.

Share this Story:

Follow Webdunia telugu