Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరో ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేసిన మోడీ సర్కారు

మరో ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేసిన మోడీ సర్కారు
, గురువారం, 11 ఆగస్టు 2011 (13:05 IST)
గుజరాత్ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ప్రభుత్వానికి సహకరించని ఐపీఎస్ అధికారులపై సస్పెండ్ వేటు వేయడం లేదా క్రమశిక్షణ చర్చల కింద ఛార్జిషీటును జారీచేయండ వంటి చర్యలకు పాల్పడుతోంది.

గోద్రా ఘటన అనంతరం గుజరాత్‌‌లో చెలరేగిన అల్లర్లకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే కారణమంటూ కోర్టుకెక్కిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్‌ భట్‌పై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెల్సిందే.

తాజాగా, ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) రాహుల్ శర్మకు ఛార్జిషీటును జారీ చేసింది. గుజరాత్ అల్లర్ల కేసు దర్యాప్తు సమయంలో ఆయన బాధ్యతారాహిత్యంగా నడుచుకున్నారంటూ ఆరోపించింది.

దీంతో శర్మపై అధికార రహస్య చట్టం (అఫిషియల్ సీక్రెట్ యాక్ట్) కింద ఛార్జిషీట్‌ను అందజేశారు. గోద్రా అల్లర్లపై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దర్యాప్తు చేపట్టిన నానావతి కమిషన్‌కు అల్లర్ల అనంతరం కీలకమైన సమాచారాన్ని అందించారన్న అభియోగాలు మోపారు.

నరోడా పాటియా కేసులో ఫోన్ రికార్డులను ధ్వంసం చేసినట్టు సిట్‌కు శర్మా ఇప్పటికే తెలిపిన విషయం తెల్సిందే. ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu