Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ : ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఎనిమిదో స్థానం!

భారత్ : ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఎనిమిదో స్థానం!
, శనివారం, 27 ఏప్రియల్ 2013 (14:14 IST)
FILE
ప్రపంచంలో చాలా శక్తివంతమైన దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. భారతీయులకు ఇది గర్వించదగ్గ విషయం. ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ రీసెర్చ్‌కు చెందిన నిపుణులు, పరిశోధకుల బృందం దేశాల శక్తియుక్తులను అంచనా వేసి వాటి సత్తా ఏంటో వెల్లడించింది.

దేశాల శక్తికి సంబంధించి అధ్యయనం జరగడం ఇదే మొదటిది. ఇంధన భద్రత, జనాభా, టెక్నాలజీ సామర్థ్యం, విదేశాలతో సంబంధ, బాంధవ్యాల తీరు, రక్షణలో స్వయం సంపత్తి, ప్రపంచంలో నాయకత్వ పాత్ర మొదలైన అంశాల ఆధారంగా ఒక్కో దేశం సత్తాను లెక్కించి వాటి స్థానమేంటో ఈ బృందం వెల్లడించింది.

మొత్తం 27 చాలా శక్తిమంతమైన దేశాలలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో పొరుగుదేశం చైనా రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో సర్వ శక్తిమంతమైన దేశంగా మొదటి స్థానం అమెరికాది కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu