Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్‌లో నితీష్‌కే మళ్లీ పట్టం: ఎగ్జిట్‌పోల్స్ సర్వే ఫలితాలు

బీహార్‌లో నితీష్‌కే మళ్లీ పట్టం: ఎగ్జిట్‌పోల్స్ సర్వే ఫలితాలు
బీహార్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మళ్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ఆ రాష్ట్ర ఓటర్లు పట్టంకట్టనున్నట్టు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. జేడీయూ-భాజపా నేతృత్వంలోని ఏన్డీయే కూటమి ఈ దఫా ఏకంగా 26 శాతం మేరకు ఓట్లను మెరుగుపరుచుకోనుందని వెల్లడించింది. ఫలితంగా నితీష్ కుమార్ కూటమి 180 నుంచి 205 సీట్లను కైవసం చేసుకోవచ్చని ఈ ఫలితాలు తేల్చాయి.

మొత్తం 243 సీట్లు కలిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 24వ తేదీన వెల్లడికానున్నాయి. నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికే ఓటర్లు పట్టంకట్టనున్నట్టు సీఎన్ఎన్-ఐబీఎన్ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో తేటతెల్లమైంది. ఇకపోతే.. కేంద్ర మాజీ మంత్రులు ఆర్జేడీ-ఎల్జేపీ అధినేతలు లాలూ ప్రసాద్ యాదవ్- రామ్ విలాస్ పాశ్వాన్‌ల నేతృత్వంలోని కూటమి ద్వితీయ స్థానానికే పరిమితం కానుందని పేర్కొంది.

ఈ కూటమికి 22 నుంచి 33 సీట్లు దక్కవచ్చని అంచనా వేయగా, కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 12 సీట్లతో మూడో స్థానంతో సరిపుచ్చుకోనుంది. ఇతరులు 9 నుంచి 19 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆ సర్వే వెల్లడించింది. బీహార్ అసెంబ్లీకి మొత్తం ఆరు దశల్లో జరిగిన ఎన్నికలు శనివారంతో ముగిసిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu