Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహారీలపై అనుచిత వ్యాఖ్యలు : రాజ్‌థాక్రేపై కేసు నమోదు!

బీహారీలపై అనుచిత వ్యాఖ్యలు : రాజ్‌థాక్రేపై కేసు నమోదు!
, ఆదివారం, 2 సెప్టెంబరు 2012 (11:07 IST)
File
FILE
బీహార్ రాష్ట్ర వాసులను కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు గాను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రేపై బీహార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, బీహారీలు అక్రమ చొరబాట్లకు పాల్పడుతున్నందుకు తక్షణం రాజ్‌థాక్రేపై చర్య తీసుకోవాలంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రజలు మహారాష్ట్రలో అక్రమ చొరబాట్లకు పాల్పడుతున్నారంటూ రాజ్‌థాక్రే ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. దీంతో స్పందించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

మరోవైపు.. రాజ్‌థాక్రే వ్యాఖ్యలపై దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని ధర్‌లో నివాసముంటున్న వారిలో అత్యధికులు ముంబై నుంచి వలస వచ్చిన వారేనన్న సంగతి ఆయన తెలుసుకోవాలని చురకేశారు. ఓసారి ముంబై గత చరిత్రను గుర్తుకు తెచ్చుకోవాలంటూ రాజ్‌థాక్రేకు దిగ్విజయ్ సూచించారు.

ఇదిలావుండగా, ఆగస్టు 11వ తేదీన ఆజాద్ మైదాన్‌లో జరిగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్ ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. దీన్ని రాజ్‌థాక్రే తీవ్రంగా నిరసిస్తున్నారు.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజ్‌థాక్రేపై కఠినంగా వ్యవహరించాలని జేడీయు నేత శివానంద తివారీ డిమాండ్ చేశారు. రాజ్‌థాక్రే వ్యాఖ్యలు దేశ సమైగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu