Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి మండపంలో వధువు ప్రసవం.. అయినా ఓకే.. వరుడు!

పెళ్లి మండపంలో వధువు ప్రసవం.. అయినా ఓకే.. వరుడు!
, సోమవారం, 24 ఫిబ్రవరి 2014 (13:16 IST)
FILE
పెళ్లి మండపంలో ఓ నవవధువు ప్రసవించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. దీంతో వరుడు తరుఫు బంధవులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పెళ్లిని రద్దు చేయాలని వారు నిర్ణయించారు. కానీ వరుడు ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టడంతో చివరకు వారి పెళ్లి జరిగింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో చోటుచేసుకుంది.

పెళ్లి మండపంలో వధువు ఓ బిడ్డకు జన్మనిచ్చినా ఇచ్చిన మాటకోసం ఆమెను పెళ్లి చేసుకున్నానని వరుడు చెబుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవద్దని పంచాయితీ నిర్ణయించినా వరుడు మాత్రం.. తాను ఆమెనే పెళ్లి చేసుకుంటానని, జీవితాంతం తోడుంటానని నిశ్చితార్థం నాడే ఆమెకు మాటిచ్చానని చెప్పాడు.

ఆ తర్వాత ఆమెనే పెళ్లాడాడు. కాగా, తన కొడుకు చేసిన మంచిపనికి తాను గర్వపడుతున్నానని పంచాయితీ సభ్యులు జరిమానా విధిస్తే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని వరుడి తండ్రి ప్రకటించారు. తన ఇంటికి తల్లీ, బిడ్డలను తీసుకెళ్లాలని వరుడు నిర్ణయించాడు.

Share this Story:

Follow Webdunia telugu