Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరియార్ రిజర్వాయర్: ఐదుగురు సభ్యులతో కమిటీ!

పెరియార్ రిజర్వాయర్: ఐదుగురు సభ్యులతో కమిటీ!
, గురువారం, 18 ఫిబ్రవరి 2010 (12:48 IST)
ముల్లై పెరియార్ రిజర్వాయర్ వ్యవహారంపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమార్తి ఏఎస్.ఆనంద్ నేతృత్వంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కోసం ఇద్దరు నిపుణులను కేంద్ర ప్రభుత్వ ఎంపిక చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఇద్దరిని తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య ఈ రిజర్వాయర్ వ్యవహారంలో దీర్ఘకాలికంగా వివాదం చోటు చేసుకుని ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత డ్యామ్‌ను కూల్చివేసి, ఎగువభాగంలో సరికొత్త డ్యామ్‌ను నిర్మించాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, దీన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.

ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్‌పై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆరు నెలల్లో నివేదికను సమర్పించాలని గడువు విధించింది. ఈ కమిటీకి అవసరమైన సహాయ సహకారాలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu