Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకిప్పుడు పెళ్ళైతే ఎంత బావుణ్ణో: కరుణానిధి

నాకిప్పుడు పెళ్ళైతే ఎంత బావుణ్ణో: కరుణానిధి
FILE
నాకిప్పుడు పెళ్ళైతే ఎంత బావుణ్ణో... ఈ మాట అన్నది ఎవరో కాదు...ఓ వయో వృద్ధుడు అందునా ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి...ఇప్పటికే మీరు ఊహించి ఉంటారనుకుంటాను. అతనే తమిళనాడు ముఖ్యమంత్రి, కళైంజర్ కరుణానిధి తన 86వ జన్మదినం సందర్భంగా చెన్నైలో 86 జంటలకు సామూహిక వివాహాలు ఉచితంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వధూవరులకు కావలసిన వంట సామగ్రి, ఇంటి సామాన్లు తదితర పెళ్ళి లాంఛనాలు ప్రదానం చేస్తూ...వీరిని చూస్తుంటే తనకు కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుందని తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారు.

ఇక్కడనున్న పెళ్ళి వాతావరణం చూస్తుంటే తనకు కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఉందని తన కోరికను వెలిబుచ్చారు. దీంతో అక్కడున్న తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పెళ్ళికి వచ్చిన జంటల బంధువులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినా, వెంటనే తేరుకుని చిరునవ్వులు చిందించారు.

ఈ వయసులో ఈయనకు ఇలాంటి ఆలోచన ఏంటబ్బా...అని అనుకోనివారు లేరంటే అతిశయోక్తి కాదు. అందునా కళైంజర్ ఇప్పటికే ముగ్గురిని వివాహమాడినట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి అతని ఆలోచన సరైందేనని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కరుణానిధి ఆలోచనకు మద్దతు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu