Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తస్లీమా నస్రీన్ వీసా గడువు పొడగించిన కేంద్రం

తస్లీమా నస్రీన్ వీసా గడువు పొడగించిన కేంద్రం
, గురువారం, 13 ఆగస్టు 2009 (15:30 IST)
File
FILE
బంగ్లాదేశ్‌కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ వీసా గడువును కేంద్రం పొడగించింది. ఆ ప్రకారంగా నస్రీన్ వీసా గుడువు వచ్చే యేడాది ఫిబ్రవరి 16వ తేదీ వరకు పొడగించినట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ యేడాది మార్చి నెలలో భారత్‌ను వదిలి ఈజిప్టు దేశాలకు వెళ్లిన నస్రీన్ ఈనెల ఆరో తేదీన స్వదేశానికి వచ్చిన విషయం తెల్సిందే.

ఆమె న్యూఢిల్లీలో అడుగుపెట్టగానే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో 47 సంవత్సరాల నస్రీన్ వీసా గడువు ఈనెల 17వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమె వీసా గడువును 2010 ఫిబ్రవరి 16వ తేదీ వరకు పొడగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

తాను స్వయంగా రాసిన లజ్జా నవల ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదమైంది. దీంతో ఆమెపై ముస్లిం సిద్ధాంతవాదులు పగబట్టారు. దీంతో ఆమె గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో తలదాచుకుంటోంది. అంతేకాకుండా, భారత్‌లో శాశ్వత నివాసం కల్పించాలని నస్రీన్ కేంద్రాన్ని కోరుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు.

Share this Story:

Follow Webdunia telugu