Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టి బిల్లుకు ప్రణబ్ ఓకే : 11న 12.30 గంటలకు రాజ్యసభకు!

టి బిల్లుకు ప్రణబ్ ఓకే : 11న 12.30 గంటలకు రాజ్యసభకు!
, సోమవారం, 10 ఫిబ్రవరి 2014 (17:22 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) 2013కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లును మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర హోంశాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

కేంద్ర మంత్రి మండలి గత శుక్రవారం ఆమోదించిన ఈ బిల్లును ప్రధాని కార్యాలయం ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయానికి పంపిన విషయం తెల్సిందే. బిల్లును రాష్ట్రపతి పరిశీలించిన తర్వాత సోమవారం ఉదయం సంతకం చేశారు.

రాష్ట్రపతి ఆమోదించడంతో బిల్లుకు సంబంధించి ఒక దశ ముగిసినట్లుగా భావిస్తున్నారు. బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెడతారని రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయవర్గాలు స్పష్టం చేశాయి.

ఇదిలావుండగా, బిల్లుపై సభలో చర్చించవలసిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు.

ఇప్పటికే బిల్లు సభలో ప్రవేశపెట్టే విషయమై రాజ్యసభలో విపక్ష బీజేపీ నేత అరుణ్‌జైట్లీతో కమల్‌నాథ్ చర్చలు జరిపారు. బిల్లు విషయం చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్నాథ్, జైరామ్ రమేష్ సమావేశమయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu